ఆ మంత్రులు టీవీల్లో క‌న‌ప‌డుతుంటే ప్రజలు చీదరించుకుంటున్నారు: దేవినేని ఉమ‌

  • రైతుల‌ను దోపిడీకి గురి చేస్తున్నారు
  • వారి స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదు  
  • మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు
  • ప‌రిపాలన అంటే ఇదేనా?
వైసీపీ స‌ర్కారుపై టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు. వెంకటగిరి నియోజకవర్గం, డక్కిలి మండలంలోని వెలికల్లు గ్రామంలో రైతుల‌ను దోపిడీకి గురి చేస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని విమ‌ర్శించారు. 75 కిలోల వడ్ల బస్తాని 80 కిలోలకు కడుతున్నారని ఆయ‌న చెప్పారు. వాటిల్లో ఒక్కో బ‌స్తాకు రైతులు ఐదేసి కిలోల బియ్యం చొప్పున న‌ష్ట‌పోతున్నార‌ని చెప్పారు.

అస‌మ‌ర్థ‌ ప్రభుత్వం వ‌ల్ల రైతులు ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొంటున్నార‌ని, వారి క‌న్నీళ్లు సీఎం జ‌గ‌న్‌కు క‌నిపిస్తున్నాయా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్ర మంత్రులు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా బూతులు మాట్లాడుతూ కాల‌యాప‌న చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

ఆ మంత్రులు టీవీల్లో క‌న‌ప‌డుతుంటే ప్రజలు చీదరించుకుంటున్నారని ఆయ‌న అన్నారు. ప‌రిపాలన అంటే ఇదేనా? అని నిల‌దీశారు. రైతుల నుంచి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.


More Telugu News