అవును, బీజేపీ నేతతో మాట్లాడాను.. తప్పేముంది?: మమతా బెనర్జీ
- నాతో మాట్లాడాలనుకుంటున్నట్టు ఫీడ్ బ్యాక్ వచ్చింది
- ఫోన్ నంబర్ తెప్పించుకుని మాట్లాడాను
- ఆడియో లీక్ చేయడం నేరమవుతుంది
తమ పార్టీలో ఉండి బీజేపీలో చేరిన నేతతో ఫోనులో మాట్లాడితే తప్పేంటని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. అందులో నేరం ఏముందని అడిగారు. విశ్వసనీయతను కోల్పోయి, ఆ సంభాషణ ఆడియోలను లీక్ చేసిన వారినే ఈ విషయంలో నిందించాలని అన్నారు. బీజేపీలో చేరిన నేతతో మమత మాట్లాడిన ఆడియో లీక్ కావడం... దుమారం రేపింది. ఆమెపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఈ నేపథ్యంలో మమత ఘాటుగా స్పందించారు.
నందిగ్రామ్ లోని ఓ బీజేపీ నేతతో మాట్లాడానని మమత తెలిపారు. తనతో ఎవరో మాట్లాడాలనుకుంటున్నట్టు ఫీడ్ బ్యాక్ వచ్చిందని... దీంతో, ఆయన నంబర్ తెప్పించుకుని మాట్లాడానని అన్నారు. ఫోన్ కాల్ సందర్భంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలని సూచించానని చెప్పారు. ఇందులో నేరం ఏముందని ప్రశ్నించారు. ఒకరు మాట్లాడిన సంభాషణలను లీక్ చేయడం నేరమవుతుందని అన్నారు. ఆడియో లీక్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి కానీ... తనను కాదని వ్యాఖ్యానించారు.