‘లేడీసింగం’ దీపాలి ఆత్మహత్య కేసులో శ్రీనివాసరెడ్డిపై వేటు

  • సీనియర్ అధికారి వేధింపులు భరించలేక దీపాలి ఆత్మహత్య
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాసరెడ్డి
  • ఉద్ధవ్‌తో స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి భేటీ
  • అనంతరం శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
మహారాష్ట్ర అటవీ అధికారిణి, లేడీ సింగంగా పేరు గాంచిన దీపాలి చవాన్ ఆత్మహత్య కేసులో సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, మెల్గాట్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిపై ప్రభుత్వం వేటువేసింది. సీనియర్ అధికారి వినోద్ శివకుమార్ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ దీపాలి పలుమార్లు శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించినట్టు దీపాలి తన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి యశోమతి ఠాకూర్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీపాలి కేసుపై చర్చించారు. శ్రీనివాసరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడైన శివకుమార్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.


More Telugu News