బిహార్‌లో ఘోర విషాదం.. ఆరుగురు చిన్నారుల సజీవదహనం
- అరారియా జిల్లా కవయ్యా గ్రామంలో ఘటన
- పూరి గుడిసెలో చెలరేగిన మంటలు
- మొక్కజొన్నలు కాలుస్తుండగా ప్రమాదం
- తల్లిదండ్రులు పనికివెళ్లిన సమయంలో విషాదం
- శోకసంద్రంలో మునిగిన గ్రామం
బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. అరారియా జిల్లా కవయ్యా గ్రామంలో ఓ పూరి గుడిసెలో చెలరేగిన మంటల్లో చిక్కుకుని ఆరుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మొక్కజొన్నలను కాలుస్తుండగా.. ఈ విషాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ చిన్నారులు బయటకు రాలేకపోయారు. చిన్నారుల హాహాకారాలు విని స్థానికులు అక్కడికి చేరుకొని మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులంతా మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులే కావడం అందరినీ కలిచివేస్తోంది. ఆరుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకొని చనిపోవడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్నారుల తల్లిదండ్రుల శోకానికి అంతేలేకుండా పోయింది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లోని పెద్దవాళ్లు పనికి వెళ్లినట్లు తెలిసింది.