సెక్స్ స్కాండల్ ప్రభావం ఉపఎన్నికలపై ఉండదు: యడియూరప్ప

  • కర్ణాటకలో కలకలం రేపిన రమేశ్ జార్కిహోళి వ్యవహారం
  • రమేశ్ పై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్న యడ్డీ
  • చట్ట పరిధిలో నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని వ్యాఖ్య
కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి ఒక మహిళతో సన్నిహితంగా వున్న దృశ్యాలతో కూడిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంతో బీజేపీ ఊహించని విధంగా విమర్శలు ఎదుర్కొంటోంది. మరోవైపు మంత్రి పదవికి రమేశ్ రాజీనామా చేశారు. అయితే, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి యడియూరప్ప తేలికగా కొట్టిపారేశారు. సెక్స్ స్కాండల్ ప్రభావం రాష్ట్రంలో జరుగుతున్న ఉపఎన్నికలపై ప్రభావం చూపదని ఆయన అన్నారు.

ఈ ఘటనపై ఇప్పటికే విచారణ జరుగుతోందని... వాస్తవాలు వెలుగులోకి వస్తాయని యడ్డీ తెలిపారు. తమ న్యాయశాఖ మంత్రి బసవరాజ్ బొమ్మాయ్ ఈ కేసును నిష్పక్షపాతంగా విచారింపజేస్తున్నారని అన్నారు. రమేశ్ జార్కిహోళిపై అనవసరమైన ఆరోపణలు చేశారని చెప్పారు. హాని తలపెట్టాలనే ఉద్దేశాలతో ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశాన్ని చట్టపరిధిలో ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా రమేశ్ ను తాను పిలిచానని తెలిపారు.


More Telugu News