ఇక నుంచి ఎయిర్‌పోర్టులో మాస్కు లేకపోతే అంతే సంగతులు!

  • కఠిన చర్యలకు సిద్ధమైన డీజీసీఏ
  • అవసరమైతే శిక్షార్హమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం
  • ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో కరోనా నిబంధనలు పాటించాలి
  • విమానాల్లో నిబంధనలు ఉల్లంఘించిన 15 మందిని దించేసినట్లు డీజీసీఏ వెల్లడి
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ పౌరవిమానయాన నియంత్రణ సంస్థ(డీజీసీఏ) కఠిన చర్యలకు సిద్ధమైంది. విమానాశ్రయాల్లో మాస్కులు లేకుండా కనిపించే వారిపై తక్షణ జరిమానాలు విధించాలని సూచించింది. ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం నిఘాను మరింత పటిష్ఠం చేయాలని ఆదేశించింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించడం వంటి శిక్షార్హమైన చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది. కరోనా నిబంధనలు పాటించని ప్రయాణికులను విమానాల నుంచి దింపేయాలని ఇప్పటికే డీజీసీఏ విమానయాన సంస్థలను ఆదేశించింది. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు మార్చి 15 నుంచి 23 మధ్య 15 మంది ప్రయాణికులను విమానాల నుంచి దించేసినట్లు డీజీసీఏ వెల్లడించింది.


More Telugu News