TDP-NTR

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో కొత్తగా 993 కేసులు!

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో కొత్తగా 993 కేసులు!
  • గుంటూరు జిల్లాలో అత్యధికంగా 198 కేసులు    
  • రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురి మృతి
  • ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,614
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 30,851 మందికి టెస్టులు నిర్వహించగా 993 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 198 కేసులు, చిత్తూరు జిల్లాలో 179, కృష్ణా జిల్లాలో 176, విశాఖపట్నం జిల్లాలో 169 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 12 కేసులు నిర్ధారణ అయ్యాయి. 24 గంటల్లో గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఇదే సమయంలో 480 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిపి కరోనా వల్ల ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,213కి చేరుకుంది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 9 లక్షలను దాటింది. మొత్తం 9,00,805 మంది కరోనా బారిన పడగా... 8,86,978 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,614 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. మాస్క్ ధరించని వారికి భారీ జరిమానాలు విధిస్తోంది.  



More Telugu News