జగన్ కు వ్యక్తిగత సేవలందిస్తే... ఎంపీ టికెట్ ఇచ్చేస్తారా?: జీవీఎల్ నరసింహారావు
- తిరుపతి అభివృద్ధిపై మోదీ ముద్ర స్పష్టంగా ఉంది
- అభివృద్ధిపై చర్చకు వైసీపీ, టీడీపీ సిద్ధమా?
- సోము వీర్రాజుపై విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ వైసీపీ భయాన్ని సూచిస్తోంది
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు సంబంధించి రేపటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ చేసిన అభివృద్ధిని, గత, ప్రస్తుత పాలకుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్ కు వ్యక్తిగతంగా సేవలందించిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇస్తారా? అని మండిపడ్డారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత సేవలు చేసినవారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వొచ్చు కదా? అని అన్నారు.
తిరుపతి ఉపఎన్నిక 'జగన్ సేవ వర్సెస్ జనం సేవ' అని జీవీఎల్ అన్నారు. ఏది కావాలో జనం తేల్చుకోవాలని చెప్పారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధాని మోదీ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. తిరుపతి అభివృద్ధిపై చర్చకు వైసీపీ, టీడీపీ సిద్ధమా? అని ప్రశ్నించారు. సోము వీర్రాజు గురించి విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ వైసీపీ భయాన్ని సూచిస్తోందని చెప్పారు.