స్టీల్ ప్లాంటుపై హైకోర్టులో పిటిషన్ వేసిన లక్ష్మీనారాయణ

  • వైజాగ్ ప్లాంటును ప్రైవేటుపరం చేయవద్దని పిల్
  • రేపు విచారణకు రానున్న పిటిషన్
  • ఇప్పటికే కేంద్రానికి కూడా లేఖ పంపిన లక్ష్మీనారాయణ
వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిల్ దాఖలు చేశారు. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం రేపు విచారణకు రానుంది. స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయవద్దని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఆందోళనలకు సంఘీభావం పలికాయి.

లక్ష్మీనారాయణ కూడా ఉద్యమానికి తన మద్దతును ప్రకటించారు. అంతేకాదు, ఏం చేస్తే స్టీల్ ప్లాంటును లాభాల బాటలోకి మళ్లించవచ్చో వివరిస్తూ... కేంద్రానికి లేఖ కూడా పంపారు. అంతేకాదు, పార్టీల నేతలు, మేధావులతో కూడా చర్చలు జరుపుతూ ఉద్యమానికి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.


More Telugu News