మయన్మార్ పై కఠిన చర్యలు ప్రారంభించిన అమెరికా!
- ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దెదించిన సైన్యం
- తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమెరికా
- పలు కంపెనీలపై తాత్కాలిక నిషేధం
మయన్మార్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దెదించి, పగ్గాలను చేపట్టిన సైన్యంపై అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉంది. మయన్మార్ తో గతంలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని, తిరిగి ప్రజాస్వామ్య పాలన మొదలైన తరువాతనే ఈ ఒప్పందం తిరిగి అమలులోకి వస్తుందని పేర్కొంది. ఇదే సమయంలో మరిన్ని కఠిన నిర్ణయాలను ప్రకటిస్తూ, సైన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న మయన్మార్ ఎకనామిక్ హోల్డింగ్స్ లిమిటెడ్, మయన్మార్ ఎకనామిక్ కార్ప్ పై ఆంక్షలను విధించింది.
మరికొన్ని మయన్మార్ సంస్థలనూ బ్లాక్ లిస్ట్ లో ఉంచనున్నట్టు వైట్ హౌస్ అధికార ప్రతినిధి జెన్ సాకీ మీడియాకు తెలిపారు. కాగా, అమెరికాతో పాటు యూకే సైతం సైనికుల పాలనపై ఆగ్రహంతో పలు కంపెనీలపై ఆంక్షలను విధించింది. కాగా, 2013లో మయన్మార్ ఉత్పత్తులను ప్రపంచానికి అందించాలన్న ఉద్దేశంతో అమెరికా ఓ డీల్ ను కుదుర్చుకుంది.
కాగా, ప్రస్తుతం ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం బర్మా ప్రజలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసిన యూఎస్ వాణిజ్య శాఖ ప్రతినిధి కేథరిన్ టాయ్, ఎనిమిదేళ్ల క్రితం కుదిరిన ఒప్పందాన్ని ఇప్పుడు నిలిపివేశామని అన్నారు. కాగా, బర్మాలో తయారయ్యే వెచ్చటి దుస్తులు, గృహోపకరణాలకు అమెరికాలో గిరాకీ అధికం. తాజా ఆంక్షలతో బర్మా ఉత్పత్తుల వాణిజ్యంపై ప్రభావం పడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.