పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కార్యకర్త తల్లి మృతిపై రాజకీయ దుమారం
- టీఎంసీ గూండాలే దాడి చేశారన్న అమిత్ షా
- మమతను ఇది జీవితాంతం వెంటాడుతుందన్న మంత్రి
- హథ్రాస్‌పై నోరెందుకు పెగల్చలేదన్న మమత
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో బీజేపీ కార్యకర్త తల్లి మృతి చెందడంపై రాజకీయ దుమారం రేగింది. జిల్లాలోని నిమ్తలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో బీజేపీ కార్యకర్త తల్లి, 85 ఏళ్ల మజుందార్ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ తర్వాత ఆమె మృతి చెందారు.
మజుందార్ మృతిపై కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్‌షా ట్విట్టర్ ద్వారా తీవ్రంగా స్పందించారు. టీఎంసీ గూండాల దాడిలోనే మజుందార్ మరణించారని ఆరోపించారు. ఆమె కుటుంబం బాధ తీర్చలేనిదని, సీఎం మమతను ఇది దీర్ఘకాలం వెంటాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
షా ట్వీట్‌కు మమత కూడా అంతే ఘాటుగా స్పందించారు. మజుందార్ మృతికి సంబంధించిన కారణాలు తనకు తెలియదని అన్నారు. మజుందార్ గురించి స్పందించిన అమిత్ షా.. హథ్రాస్ ఘటనపై ఎందుకు స్పందించ లేదని సూటిగా ప్రశ్నించారు. యూపీలో అలాంటి దారుణం జరిగినప్పుడు షా మౌనంగా ఎందుకు ఉన్నారని మమత నిలదీశారు.