ఆదిలాబాద్‌లో దారుణం.. కరోనా సోకిందని యువతిని ఊర్లోకి రానివ్వని గ్రామస్థులు

  • గురుకులంలో ఉంటూ ఇంటర్ చదువుతున్న బాలిక
  • కరోనా సోకడంతో స్వగ్రామానికి రాక 
  • అధికారులు చెప్పినా అనుమతించని పెద్దలు
  • ఐసోలేషన్ పూర్తయ్యే వరకు గ్రామం బయటే ఉండాలన్న పంచాయతీ పెద్దలు
కరోనా సోకిందన్న కారణంతో ఓ యువతిని ఊళ్లోకి అడుగుపెట్టనీయకుండా గ్రామ  పెద్దలు అడ్డుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయతీ పరిధిలో జరిగిందీ  ఘటన. సాలెగూడకు చెందిన మడావి సోన్‌దేవి గురుకులంలో ఉంటూ ఇంటర్ చదువుతోంది. బాలికకు ఇటీవల కరోనా వైరస్ సంక్రమించడంతో గ్రామానికి పయనమైంది.

విషయం తెలిసిన గ్రామ పెద్దలు ఆమెను ఊరిలో అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్నారు. దీంతో విధిలేక ఊరి చివరన ఉన్న తమ పొలంలో ఐసోలేషన్‌లో ఉంది. అక్కడ కరెంటు సౌకర్యం లేకపోవడంతో రాత్రుళ్లు చిమ్మ చీకట్లో భయంభయంగా గడుపుతోంది. విషయం తెలిసిన ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్, గురుకులం ఆర్‌సీవో గంగాధర్ నిన్న గ్రామానికి వచ్చి బాలికను పరామర్శించారు.

పంచాయతీ పెద్దలను కలిసి ఆమెను గ్రామంలోకి అనుమతించాలని కోరారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. మరో నాలుగు రోజుల్లో ఆమె క్వారంటైన్ పూర్తవుతుందని, అప్పటి వరకు ఆమె ఊరిబయట ఉండకతప్పదని పెద్దలు తేల్చి చెప్పారు.


More Telugu News