మౌలాలిలో హల్‌చల్ చేసిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి.. స్పందించిన పోలీసులు
- స్థలం విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం
- రేకుల షెడ్డు తొలగించి, ప్రహరీని కూల్చివేయించిన విజయారెడ్డి
- తమ కార్యకర్తకు అండగా ఉండేందుకేనని వివరణ
నగరంలోని మౌలాలిలో ఓ స్థల వివాదంలో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి జోక్యం చేసుకున్నారు. తన అనుచరుడికి చెందిన స్థలాన్ని మరొకరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. ఆ స్థలంలో వేసిన రేకుల షెడ్డును తొలగించారు. ప్రహరీని కూల్చివేయించారు. స్వయంగా ఆమె కూడా కొన్నింటిని తొలగించారు. వివాదాస్పద స్థలం వద్ద విజయారెడ్డి హల్‌చల్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు.
ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్టు మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాదరావు తెలిపారు. కాగా, తమ కార్యకర్త కుటుంబం ఆ స్థలాన్ని 1974లో కొన్నదని, ఇటీవల కొందరు వ్యక్తులు ఈ భూమి విషయంలో కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని షెడ్డు వేసి దౌర్జన్యం చేస్తున్నారని విజయారెడ్డి పేర్కొన్నారు. దీంతో తన అనుచరుడికి అండగా ఉండేందుకే అక్కడికి వెళ్లినట్టు తెలిపారు.