నేపాల్‌కు లక్ష డోసుల టీకాను అందించిన భారత్
- టీకాలిచ్చి ఇతర దేశాలను ఆదుకొంటున్న భారత్
- ఇప్పటికే అనేక దేశాలకు చేరిన ఉచిత టీకాలు
- తాజాగా నేపాల్ ఆర్మీకి డోసుల్ని అందజేసిన భారత ఆర్మీ
- నేపాల్‌కు 8 లక్షల టీకాలను అందించనున్న చైనా
కరోనా సంక్షోభ కాలంలో కరోనా టీకాల్ని అందించి భారత్ ఇతర దేశాలను ఆదుకొంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక దేశాలకు లక్షలాది టీకా డోసులను ఉచితంగా అందించింది. తాజాగా పొరుగు దేశం నేపాల్ సైన్యానికి కూడా టీకాలను అందించింది మన కేంద్ర ప్రభుత్వం. ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగానే నేపాల్ ఆర్మీకి.. భారత్ సైన్యం లక్ష డోసుల కొవిడ్ వ్యాక్సిన్లను బహుమతిగా ఇచ్చినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ఆర్మీ అధికారులు వీటిని నేపాల్ సైనికాధికారులకు అందజేశారు. ఈ మేరకు భారత దౌత్యకార్యాలయం సోమవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అంతకుముందు నేపాల్ ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం భారత ప్రభుత్వం ఆ దేశానికి పది లక్షల స్వదేశీ వ్యాక్సిన్లను పంపించిన విషయం తెలిసిందే.
మరోపక్క, నేపాల్ కు 8 లక్షల టీకా డోసులను ఇవ్వనున్నట్లు చైనా కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా నేడు 5 లక్షల డోసులను ఆ దేశానికి పంపించింది. నేపాల్‌లో ఇప్పటివరకు 2.7 లక్షల మందికి కరోనా వైరస్ సోకగా.. 3,027 మంది ప్రాణాలు కోల్పోయారు.