అందరూ ఊహించినట్టే.. కరోనా పుట్టుకపై డబ్ల్యూహెచ్‌వో, చైనా సంయుక్త నివేదిక!
- ల్యాబ్ నుంచి వైరస్ బయటకు రాలేదు
- గబ్బిలాల నుంచి మరో జంతువుకు వచ్చింది
- వాటి ద్వారా మనుషులకు సోకి ఉండొచ్చు
- ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందన్న వాదనను వదిలేయాలన్న వైనం
మానవాళిని ముప్పుతిప్పలు పెడుతోన్న కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందంటూ తీవ్ర ఆరోపణలు వస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై డబ్ల్యూహెచ్‌వో, చైనా పరిశోధకులు సంయుక్తంగా అధ్యయనం చేసి ఆ వైరస్ గబ్బిలాల నుంచి మరో జంతువుకు, వాటి ద్వారా మనుషులకు సోకి ఉండొచ్చని తేల్చారు. ల్యాబ్ నుంచి లీకయ్యే అవకాశాలు చాలా తక్కువని తెలిపారు.
అయితే చైనా, డబ్ల్యూహెచ్‌వో ఇటువంటి నివేదికనే ఇస్తారని చాలా మంది ముందుగానే ఊహించారు. వారు ఊహించనట్లే ఇప్పుడు అధ్యయన ఫలితాలు వున్నాయి. ఈ నివేదికలో చాలా ప్రశ్నలకు అసలు సమాధానాలు లేవు.
అంతేగాక, ఇకపై ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందన్న వాదనను వదిలేసి మిగతా అంశాలపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో, చైనా పేర్కొనడం గమనార్హం. ఈ నివేదికను డబ్ల్యూహెచ్‌వో అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. తాజాగా, జెనీవాలోని ఐరాస కార్యాలయంలో ఓ దౌత్యవేత్త ద్వారా ఓ ఏజెన్సీ పలు వివరాలు సేకరించడంతో ఈ విషయాలు తెలిశాయి.
కాగా, రెండు నెలల క్రితం చైనాకు వెళ్లిన డబ్ల్యూహెచ్‌వో బృందం కరోనా మూలాలను పరిశీలన చేసింది. అందుకు సంబంధించిన నివేదికను విడుదల చేయడంలో మాత్రం జాప్యం చేస్తూ వచ్చింది. కరోనా విషయంలో మొదటి నుంచి చైనాకు డబ్ల్యూహెచ్‌వో అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.