ఎమ్మెల్యే రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు.. రెండు వారాల పాటు విశ్రాంతి
- చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్లు
- ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలింపు
- ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేసిన భర్త సెల్వమణి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. ఈ రోజు ఆమెను వైద్యులు ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. ఆపరేషన్లు జరిగిన నేపథ్యంలో రెండు వారాల పాటు రోజా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని తెలుపుతూ రోజా భర్త సెల్వమణి ఓ ఆడియో మెసేజ్ విడుదల చేశారు.
రోజాకు గత ఏడాదే ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉండగా, కరోనా విజృంభణ నేపథ్యంలో వాయిదా పడిందని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో ఆపరేషన్ చేయించుకుందామనుకున్నారని, అయితే, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా వాయిదా వేసుకున్నారని వివరించారు. ఆమె ఆరోగ్యం కుదుటపడుతోందని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆమెను చూసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే, సర్జరీలు ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు.