మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోల హతం!

  • ఖురుకేడ తాలూకాలో ఎన్ కౌంటర్
  • మృతులలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు
  • తప్పించుకున్న మావోల కోసం కొనసాగుతున్న కూంబింగ్
మహారాష్ట్రలో మరో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఉదయం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఖురుకేడ తాలూకా కొబ్రామెండ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.

చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్టు తెలుస్తోంది. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. తప్పించుకున్న వారిలో కూడా కొందరికి తీవ్ర గాయాలయినట్టు సమాచారం. అందరినీ ఏరివేసేంత వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు.


More Telugu News