రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చూస్తే .. దిన దిన గండంలా కనిపిస్తుంది: గోరంట్ల బుచ్చ‌య్య‌ చౌద‌రి

  • వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగిస్తున్నారు
  • ఇందులో ముఖ్య విషయం రైతు బిల్ కట్టాలి
  • తరువాత రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది
  • దీనిపై లోగుట్టు తాడేపల్లికి ఎరుక  
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టే అంశంపై ఆయ‌న స్పందించారు. 'వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించాలని కేంద్రం చెబితే రాష్ట్ర ప్రభుత్వం వాటికి ఒప్పుకుని మోటర్లకి మీటర్లు బిగిస్తోంది. ఇందులో ముఖ్య విషయం రైతు బిల్ కట్టాలి. రైతుకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇవ్వాలి అనుకుంటే రైతు కట్టిన బిల్లు రసీదుని చూసి నేరుగా రైతు అకౌంట్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చెయ్యాలి' అని చెప్పారు.
 
'అంటే ముందు రైతు బిల్ కట్టాలి.. తరువాత రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. అప్పులు కుప్పలుగా ఉన్న‌ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మేరకు సామర్థ్యం ఉందా? రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి చూస్తే .. దిన దిన గండం లాగా కనిపిస్తుంది. దీనిపై లోగుట్టు తాడేపల్లికి ఎరుక' అని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి విమ‌ర్శ‌లు గుప్పించారు.


More Telugu News