పవన్ కల్యాణ్ కు సముచిత గౌరవం ఇవ్వాలని మోదీ సూచించారు: సోము వీర్రాజు
- తిరుపతి ఉపఎన్నికపై బీజేపీ, జనసేన ఫోకస్
- రాష్ట్రానికి పవన్ అధిపతి కావాలన్న వీర్రాజు
- కూటమి అభ్యర్థి కోసం జనసైనికులు కృషి చేయాలన్న మనోహర్
తిరుపతి ఉపఎన్నికలో గెలుపొందేందుకు జనసేన, బీజేపీ కూటమి తీవ్ర కృషి చేస్తోంది. ఇరు పార్టీలకు చెందిన అగ్ర నాయకత్వం తిరుపతిలోనే మకాం వేసి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఇరు పార్టీల నేతల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటు జనసేన తరపున నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ, జనసేనాని పవన్ కల్యాణ్ కు సముచిత గౌరవం ఇవ్వాలంటూ ప్రధాని మోదీ తనకు నేరుగా సూచించారని చెప్పారు. ఈ రాష్ట్రానికి పవన్ అధిపతి కావాలని అన్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను జనసైనికులు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి రత్నప్రభ విజయం కోసం పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. బేధాభిప్రాయాలు లేకుండా ఇరు పార్టీల శ్రేణులు ముందుకు సాగాలని చెప్పారు.