అమిత్ షా ఏమైనా ఈవీఎంలలోకి దూరారా?: మమత ఎద్దేవా

  • ఆ 30 స్థానాల్లో 26 స్థానాల్లో గెలుస్తామన్న షా
  • 30 గెలుస్తామని ఎందుకు చెప్పడం లేదన్న మమత   
  • బెంగాల్‌ను బయటి వ్యక్తులు పాలించబోరన్న టీఎంసీ చీఫ్
తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఈ నెల 27న పశ్చిమ బెంగాల్‌లో 30 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 26 స్థానాల్లో విజయం సాధిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.

26 స్థానాల్లో మాత్రమే గెలుస్తామని ఎలా చెబుతున్నారని, కొంపదీసి ఆయనేమైనా ఈవీఎంలలోకి దూరారా? అని మమత ప్రశ్నించారు. మే 2వ తేదీ వరకు ఆగితే ఎవరు ఎన్ని స్థానాల్లో గెలుస్తారో తెలిసిపోతుందని అన్నారు. బెంగాల్‌ను బయటి వ్యక్తులు పాలించబోరని, ఇక్కడ టీఎంసీదే విజయమని మమత ధీమా వ్యక్తం చేశారు.

 ‘‘30 స్థానాలకు ఎన్నికలు జరిగితే 26 సీట్లను బీజేపీ సొంతం చేసుకుంటుందని షా అంటున్నారు. ఆయనేమైనా ఈవీఎంలలోకి దూరారా? ఎన్నికలు జరిగిన 30 స్థానాలనూ తామే గెలుచుకుంటామని ఎందుకు చెప్పడం లేదు. ఫలితాలు వచ్చాక తెలుస్తుంది.. ఎవరెన్ని గెలిచారో. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి’’ అని మమత అన్నారు.


More Telugu News