కేసీఆర్‌, కేటీర్‌ తప్పుకుంటే టీఆర్ఎస్ లో చేరతా: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

  • టీఆర్ఎస్ బాధ్యతల్ని హరీశ్‌ లేదా ఈటెలకు ఇవ్వాలని సూచన
  • అప్పుడే ఆ పార్టీలో చేరతానని కండిషన్‌
  • ఈటెలను అపాయింట్‌మెంట్‌ కోరానని వెల్లడి
  • ఇంకా ఇవ్వలేదని తెలిపిన మాజీ ఎంపీ
  • టీఆర్ఎస్ నాయకుల ఫోన్‌లు ట్యాప్‌ అయ్యాయని ఆరోపణ
  • రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అవసరం ఉందని వ్యాఖ్య
కేసీఆర్‌, కేటీఆర్‌ తప్పుకొని టీఆర్ఎస్ నాయకత్వాన్ని హరీశ్‌ లేదా ఈటెలకు ఇస్తే మళ్లీ టీఆర్ఎస్ లో చేరతానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. త్వరలో ఈటెలను కలిసి మాట్లాడాలనుకుంటున్నానని.. అపాయింట్‌మెంట్‌ కూడా అడిగానని తెలిపారు. అయితే, ఇంకా అవకాశం ఇవ్వలేదన్నారు. ఫోన్ల ట్యాపింగ్ భయంతో టీఆర్ఎస్ నేతలు తనతో మాట్లాడడానికి భయపడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉందని  విశ్వేశ్వర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని... రాష్ట్రంలో మరోపార్టీ రావాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ బలమైన ప్రతిపక్షంగా ఉండలేకపోతోందన్నారు. ఆ పార్టీలో చాలా మంది నాయకులు అమ్ముడుపోతున్నారని ఆరోపించారు.


More Telugu News