మన స్నేహానికి నిర్వచనం ఈ ఫొటో: ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన రామ్ చరణ్

  • నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు
  • తమ స్నేహాన్ని చాటేలా ఉన్న ఫొటో పోస్టు చేసిన ఎన్టీఆర్
  • లవ్యూ తారక్ అంటూ రిప్లై ఇచ్చిన చరణ్
  • మరోసారి వెల్లడైన ఎన్టీఆర్, చరణ్ ల స్నేహానుబంధం
టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు చెప్పుకోవాలి. అనేక సందర్భాల్లో వీరి మధ్య స్నేహం వెల్లడైంది. నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ తమ చెలిమికి గుర్తుగా ఓ ఫొటో పోస్తు చేశాడు. తాజాగా ఆ ఫొటోపై రామ్ చరణ్ స్పందించాడు. లవ్యూ తారక్ అంటూ తన అభిమానాన్ని ప్రదర్శించాడు. మన మధ్య ఉన్న స్నేహాన్ని ఈ ఫొటో నిర్వచిస్తోంది అంటూ ట్వీట్ చేశాడు.

ఎన్టీఆర్, చరణ్ ల స్నేహం వాళ్లిద్దరీ మధ్యనే కాకుండా వారి కుటుంబాలకు సైతం విస్తరించింది. అనేక కార్యక్రమాలకు వీరు కుటుంబ సభ్యుల సమేతంగా హాజరవడమే అందుకు నిదర్శనం. కాగా, ఇటీవలకాలంలో టాలీవుడ్ హీరోల్లో చాలామంది సొంత ప్రొడక్షన్ సంస్థలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఓ చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించాలంటూ తారక్ కు చరణ్ సలహా ఇచ్చినట్టు, మిత్రుడి సలహాను పరిశీలించిన తారక్, ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.


More Telugu News