200 పాముల నుంచి.. రూ.కోటి విలువైన లీటర్ విషం!
- అక్రమంగా తరలిస్తున్న ఆరుగురి అరెస్ట్
- ఒడిశాలోని బాలాసోర్ లో ఘటన
- రూ.10 లక్షలకు డీల్ మాట్లాడుకున్నారన్న అధికారులు
పాము విషాన్ని తీసి అక్రమంగా తరలిస్తున్న ముఠాను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కోటి రూపాయల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ వో) అశోక్ మిశ్రా వెల్లడించారు.
లీటర్ విషాన్ని సీజ్ చేశామని చెప్పారు. దాంతో పాటు ఐదు మిల్లీలీటర్ల చొప్పున ఉన్న 5 వయల్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటి విలువ అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం రూ.కోటి దాకా ఉంటుందని చెప్పారు.
బాలాసోర్ కు చెందిన ఓ మహిళ సహా ముగ్గురు సభ్యుల ముఠా రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకుందని తెలిపారు. డీల్ ప్రకారం 200 త్రాచు పాముల నుంచి లీటర్ విషాన్ని తీశారని చెప్పారు. వారితో పాటు కేసుతో సంబంధమున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు.