ముంబై ఇండియన్స్ జెర్సీ మారింది.. ఇదీ క్యాప్షన్
- కొత్త జెర్సీని విడుదల చేసిన యాజమాన్యం
- ఒక టీం.. ఒక కుటుంబం.. ఒక జెర్సీ అంటూ క్యాప్షన్
- కావాలంటే ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని సూచన
ఐపీఎల్ లో మరే టీంకు సాధ్యం కాని రీతిలో ముంబై ఇండియన్స్ నాలుగు టైటిళ్లు సాధించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో జయకేతనాలు ఎగురవేస్తోంది. గత ఏడాది లాక్ డౌన్ తో ఆలస్యంగా ప్రారంభమైన సీజన్ లోనూ కప్ కొట్టేసింది. చూస్తుండగానే మళ్లీ 14వ సీజన్ వచ్చేసింది. ఈ సీజన్ లోనూ మరో కప్ సాధించేందుకు ఉత్సాహంతో ఉరకలెత్తుతోంది.
ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ తన జెర్సీని మార్చింది. రంగు, డిజైన్ లో కొన్ని మార్పులు చేసింది. గత ఏడాది కొంచెం ముదురు నీలి రంగు జెర్సీల్లో మెరిసిపోయిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు.. ఇప్పుడు కొంచెం లేత నీలి రంగు జెర్సీల్లో ఆడబోతున్నారు. కొత్త జెర్సీకి సంబంధించిన వివరాలను ముంబై ఇండియన్స్ యాజమాన్యం ట్విట్టర్ లో వెల్లడించింది.
కొత్త సీజన్ లో కొత్త జెర్సీ అంటూ ట్వీట్ చేసింది. ‘ఒక టీం.. ఒక కుటుంబం.. ఒక జెర్సీ’ అన్న క్యాప్షన్ తో జెర్సీని విడుదల చేసింది. కావాల్సిన వాళ్లు ముందే ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చని సూచించింది. ద సోల్డ్ స్టోర్ నుంచి ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
కాగా, ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్ మొదలుకానుంది. 2013, 2015, 2017, 2019, 2020లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ టైటిళ్లు సాధించింది. ఈ ఏడాది మరో టైటిల్ ను సాధించేందుకు హ్యాట్రిక్ పై గురి పెట్టింది.