జానారెడ్డిపై బాల్క సుమన్ విమర్శలు
- కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది
- ఆ పార్టీ తుడుచుపెట్టుకుపోయింది
- జానారెడ్డికి ఓటమి భయం
- ఎన్నడూ సామాన్య ప్రజలను పట్టించుకోలేదు
నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి వచ్చేనెల 17న జరగనున్న ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న ఆయన తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని విమర్శించారు.
దేశంలో, తెలంగాణలో ఆ పార్టీ తుడుచు పెట్టుకుపోయిందని చెప్పారు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఓటమి భయంతో జానారెడ్డికి వెన్నులో వణుకుపుడుతోందని విమర్శించారు. నిన్న జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన ఓటమిని ఒప్పుకున్నట్లుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆయన ఎన్నడూ సామాన్య ప్రజలను పట్టించుకోలేదని బాల్క సుమన్ ఆరోపించారు.