మరో ఇండో అమెరికన్ మహిళకు కీలక పదవి... యూఎస్ లేబర్ సొలిసిటర్ గా సీమా నందా!
- సీమా నందాకు కీలక పదవి
- పదిహేనేళ్లుగా లేబర్ విభాగంలో విధులు
- ఒబామా అధ్యక్షుడిగా ఉన్న వేళ కీలక బాధ్యతలు
ఇప్పటికే పలువురు కీలక భారత సంతతి వ్యక్తులకు ఉన్నత పదవులు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పాలనలో 50 శాతం మందికి పైగా భారత సంతతి వ్యక్తులకు పదవులను ఇచ్చిన ఆయన, తాజాగా మరో ఇండో అమెరికన్ మహిళకు ఉన్నత పదవిని ఇచ్చారు. సీమా నందాను యూఎస్ లేబర్ సొలిసిటర్ గా నియమించారు. ఈ మేరకు వైట్ హౌస్ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. ఆమెను కార్మిక శాఖ సొలిసిటర్ గా అధ్యక్షుడు బైడెన్ నామినేట్ చేశారంటూ ప్రకటించింది.
కాగా, గతంలో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సీమ, కార్మిక శాఖలో చీఫ్ ఆఫ్ స్టాప్ గా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా, డిప్యూటీ సొలిసిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. దాదాపు పదిహేనేళ్లుకు పైగా లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ అటార్నీ విభాగాల్లో ఆమె సేవలందించారు. అత్యధికంగా ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన కార్యకలాపాలను ఆమె నిర్వహించారు.ఇప్పుడామె యూఎస్ జస్టిస్ డిపార్ట్ మెంట్ పరిధిలో ఉన్న పౌర హక్కుల విభాగంలో విదేశాల నుంచి అమెరికాకు వచ్చే ఇమిగ్రెంట్స్, యూఎస్ ఉద్యోగుల హక్కుల విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. అమెరికాలోని కనెక్టికట్ లో పెరిగిన సీమా నందా, ఆపై బోస్టన్ కాలేజ్ న్యాయ పాఠశాల నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాను పొందారు. దాని తరువాత బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు.