తిరుమలలో సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ!

  • శనివారం స్వామిని సందర్శించిన 53 వేల మంది
  • హుండీ ఆదాయం రూ. 2.69 కోట్లు
  • ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి
ఏడు కొండలపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న శనివారం నాడు స్వామి వారిని 53,567 మంది దర్శించుకోగా, 28,109 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ ఉన్నతాధికారులు వెల్లడించారు. హుండీ ద్వారా స్వామివారికి రూ. 2.69 కోట్లు కానుకల రూపంలో వచ్చాయి. ఇక స్వామివారి తెప్పోత్సవాలు వైభవంగా జరిగాయని పేర్కొన్న టీటీడీ అధికారులు, ఉగాది తరువాత ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించనున్నామని, అయితే, కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ను తప్పనిసరి చేశామని తెలిపారు.

ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదని, పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్ల జారీని ఇంకా ప్రారంభించలేదని స్పష్టం చేశారు.


More Telugu News