సీఎం పళనిస్వామిని స్టాలిన్ కాలి చెప్పుతో పోల్చిన డీఎంకే ఎంపీ... ఫిర్యాదు చేసిన అన్నాడీఎంకే
- వివాదం రేకెత్తించిన ఏ.రాజా
- సీఎం పళనిస్వామిపై ధ్వజం
- 'అపరిపక్వ రాజకీయ శిశువు' అంటూ వ్యాఖ్యలు
- 'స్టాలిన్ నికార్సయిన బాలుడు' అంటూ కితాబు
డీఎంకే ఎంపీ ఏ.రాజా వివాదానికి కేంద్రబిందువులా నిలిచారు. చెన్నై థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి డాక్టర్ ఎన్.ఎళిలన్ తరఫున ప్రచారంలో పాల్గొన్న రాజా సీఎం పళనిస్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పళనిస్వామిని డీఎంకే అధినేత స్టాలిన్ కాలి చెప్పుతో పోల్చారు. అంతేకాదు, 'అక్రమ సంబంధం కారణంగా పుట్టిన అపరిపక్వ రాజకీయ శిశువు' అని కూడా పళనిస్వామిని విమర్శించారు. అదే సమయంలో స్టాలిన్ ను ఆకాశానికెత్తేశారు. 'నికరంగా పుట్టిన పరిణతి చెందిన బాలుడు' అని అభివర్ణించారు.
ఏరోజుకారోజే బెల్లం మార్కెట్టులో పనిచేసుకుంటూ పదవిలోకి వచ్చిన పళనిస్వామిని స్టాలిన్ తో ఎలా పోల్చగలం? అని రాజా వ్యాఖ్యానించారు. "స్టాలిన్ కాలిచెప్పు నీకంటే ఓ రూపాయి ఎక్కువ ధరే పలుకుతుంది... నువ్వా స్టాలిన్ కు సవాల్ విసిరేది?" అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను అధికార అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. రాజా వ్యాఖ్యలు అసభ్యకరంగానూ, వికృతంగానూ ఉన్నాయంటూ అన్నాడీఎంకే న్యాయవిభాగం తమిళనాడు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేసింది.