బెంగాల్‌లో కలకలం రేపుతున్న మమత ఆడియో టేపు
- తన విజయానికి సహకరించాలని కోరిన మమత
- నందిగ్రామ్‌కు చెందిన నాయకుడు ప్రళయ్ పాల్‌తో దీదీ సంభాషణ
- గతంలో తృణమూల్‌లో పనిచేసిన ప్రళయ్
- ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ
- విశ్వసనీయత ఏంటని ప్రశ్నించిన తృణమూల్
పశ్చిమ బెంగాల్‌లో శాసనసభ ఎన్నికలు ప్రారంభమైన వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించిన ఓ ఆడియో టేపు కలకలం రేపుతోంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నందిగ్రామ్ ప్రాంతానికి చెందిన నాయకుడు ప్రళయ్ పాల్‌ను సొంతగూటికి రావాలని బుజ్జగిస్తున్న ఓ ఆడియో టేపును భాజపా విడుదల చేసింది.
శాసనసభ ఎన్నికల్లో మమత నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తున్నారు. తన విజయానికి సహకరించాలని మమత ప్రళయ్‌ను కోరుతున్నట్లు ఈ ఆడియో టేపులో ఉంది. బీజేపీ ఈ టేపును ఎన్నికల సంఘం ప్రధానాధికారికి అందజేసింది. సీఎం పదవిలో ఉన్న మమత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపించింది.
మరోవైపు ఈ ఆడియో టేపులో విశ్వసనీయత ఏముందని తృణమూల్ కాంగ్రెస్ ప్రశ్నించింది. అయినా, గతంలో తృణమూల్‌లో ఉన్న ప్రళయ్‌ను అలా అడిగితే తప్పేంటని వాదించింది.