రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మంగళవారం బైపాస్ ప్రక్రియ

  • ఛాతీలో అసౌకర్యంతో ఆసుపత్రిలో చేరిన రాష్ట్రపతి
  • ఆర్మీ ఆసుపత్రి నుంచి నేడు ఎయిమ్స్ కు తరలింపు
  • ఎయిమ్స్ లో కోవింద్ కు వైద్య పరీక్షలు
  • ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్న రాష్ట్రపతి భవన్
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (75) ఛాతీలో అసౌకర్యానికి గురికావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించడం తెలిసిందే. తొలుత ఢిల్లీలోని ఆర్మీ రిఫరల్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం నేడు ఎయిమ్స్ కు తరలించారు.

అయితే, వైద్య పరీక్షల అనంతరం రామ్ నాథ్ కోవింద్ కు మంగళవారం బైపాస్ ప్రక్రియ  నిర్వహించాలని ఎయిమ్స్ వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలిపింది. ఎయిమ్స్ వైద్య నిపుణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని వివరించింది.


More Telugu News