కరోనాకు వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి లాక్ డౌన్ అవసరంలేదని భావిస్తున్నాం: హోంమంత్రి సుచరిత
- ఏపీలో మరోసారి కరోనా విజృంభణ
- కేసులు క్రమంగా పెరుగుతున్నాయన్న సుచరిత
- లక్షణాలు లేకున్నా పాజిటివ్ వస్తోందని వెల్లడి
- వ్యాక్సిన్లపై దుష్ప్రచారాన్ని నమ్మవద్దని సూచన
ఏపీలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తుండడం పట్ల రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయని అన్నారు. కొందరిలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా పాజిటివ్ వస్తోందని వివరించారు.
అయితే, కొవిడ్ నివారణకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి మళ్లీ లాక్ డౌన్ అవసరం లేదని భావిస్తున్నామని సుచరిత స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఎవరూ భయపడొద్దని తెలిపారు. కొవిడ్ టీకాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.