కుప్పం రెస్కోను విలీనం చేయొద్దు... ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు చంద్రబాబు లేఖ
- రెస్కోలను డిస్కంలలో విలీనం చేయాలని సర్కారు నిర్ణయం
- ఈ మేరకు ఉత్తర్వులు జారీ
- కుప్పం, అనకాపల్లి, చీపురుపల్లిలో రెస్కోలు
- కుప్పం రెస్కో ఎంతో ఉపయుక్తంగా ఉందన్న చంద్రబాబు
- ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి
ఏపీలోని మూడు రూరల్ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (రెస్కో)లను డిస్కంలలో విలీనం చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. కుప్పం రెస్కో స్వాధీనం ఉత్తర్వులపై ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు ఆయన లేఖ రాశారు.
కుప్పం రెస్కో స్వాధీనం ఆదేశాలు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమ్మకం, పంపిణీ, లైసెన్స్ కారణాలతో ఏకపక్ష చర్యలు సరికాదని హితవు పలికారు. రెస్కో పరిధిలో 1.24 లక్షల గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని వివరించారు. రెస్కోను ఎస్పీడీసీఎల్ లో విలీనం చేయడం అర్థరహితమైన చర్య అని విమర్శించారు. ఈఆర్సీ తీసుకున్న నిర్ణయం నిరాశకు గురిచేసిందని వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో కుప్పంలో కాకుండా చీపురుపల్లి, అనకాపల్లిలో కూడా రెస్కోలు ఉన్నాయి.