ఒక్కొక్కరి నుంచి 8 నుంచి 9 మందికి కరోనా వ్యాపిస్తుంది: తెలంగాణ మెడికల్ డైరెక్టర్

  • ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వస్తుంది
  • పాజిటివ్ అని తేలినా ఆందోళన చెందొద్దు
  • ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బు వృథా చేసుకోవద్దు
కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. సెకండ్ వేవ్ దెబ్బకు యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గతంలో తెలంగాణలో కరోనా విస్తరణ ఉద్ధృతంగా ఉన్నప్పుడు ఎక్కువ కేసులు హైదరాబాదులోనే నమోదయ్యాయి. ఇప్పుడు కూడా ఎక్కువ కేసులు ఇక్కడ నుంచే వస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర మెడికల్ డైరెక్టర్ రమేశ్ రెడ్డి కీలక సూచనలు చేశారు.

ఫంక్షన్లు, వేడుకలకు వెళ్లకపోవడమే మంచిదని రమేశ్ రెడ్డి సూచించారు. కేసులు పెరిగినా దానికి అవసరమైన మందులు, కిట్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కరోనా పాజిటివ్ అని తేలినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బు వృథా చేసుకోవద్దని హితవు పలికారు. ఒక్కో వ్యక్తి నుంచి 8 నుంచి 9 మందికి కరోనా విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించారు. అది కూడా ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు పూర్తి అప్రమత్తంగా ఉండాలని అన్నారు.


More Telugu News