ప్రముఖ సినీ నటుడు 'వేదం' నాగయ్య కన్నుమూత
- అల్లు అర్జున్ నటించిన వేదం సినిమాతో గుర్తింపు
- ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న నాగయ్య
- అనారోగ్యంతో మృతి
- ప్రముఖుల సంతాపం
ప్రముఖ సినీ నటుడు నాగయ్య కన్నుమూశారు. అల్లు అర్జున్ నటించిన 'వేదం' సినిమాలో శ్రీను అనే బాలుడికి రాములు తాత పాత్రలో నటించి, ఆ సినిమాలో బన్నీతోనూ తాత అని పిలుపించుకున్న నాగయ్య పేరు ముందు 'వేదం' ఇంటి పేరులా మారిపోయింది. ఆ సినిమాతోనే ఆయన అందరి దృష్టిని ఆకర్షించి వరుసగా మరిన్ని సినిమా అవకాశాలు పొందారు.
దాదాపు 30కి పైగా సినిమాలలో నటించారు. లీడర్, నాగవల్లి, రామయ్య వస్తావయ్యా, స్పైడర్ వంటి సినిమాలు ఆయనకు మరింత గుర్తింపు తెచ్చాయి. పాత్రలో పూర్తిలో ఒదిగిపోయి, నటించడమే కాకుండా అందులో జీవిస్తారన్న పేరును సంపాదించుకున్నారు. సినిమాల్లో నటించినప్పటికీ ఆయన ఆర్థిక సమస్యల నుంచి బయటపడలేకపోయారు. అనారోగ్యంతో ఆయన భార్య ఆ మధ్య కన్నుమూశారు.
దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. అలాగే, మా అసోసియేషన్ నెలకు రూ.2,500 పింఛన్ ను ఇప్పించింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా, నాగయ్యది గుంటూరు జిల్లా, నరసరావుపేట సమీపంలోని దేసవరం పేట గ్రామం. సొంత గ్రామంలో పని దొరకకపోవడంతో కొడుకుతో కలిసి హైదరాబాద్‌కు వచ్చారు.