ఆరు గంటలపాటు మంచం కింద దాక్కొని.. భార్య ప్రియుడిని మట్టుబెట్టిన మహిళ భర్త
- స్నేహితుడితో భార్యకు వివాహేతర సంబంధం
- గొడవల కారణంగా వేరుగా ఉంటున్న భార్య
- భార్య ప్రియుడిని హత్య చేసేందుకు 6 గంటలపాటు మంచం కింద వేచి చూసిన నిందితుడు
తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని మట్టుబెట్టేందుకు ఓ వ్యక్తి ఏకంగా ఆరు గంటలపాటు మంచం కింద నక్కి సమయం కోసం ఎదురుచూశాడు. సమయం చిక్కగానే కత్తితో నరికి చంపాడు. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా బైడరహళ్లిలో జరిగిందీ ఘటన.
పోలీసుల కథనం ప్రకారం.. భరత్ కుమార్ (31), వినుత దంపతులకు 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఉద్యోగాన్ని వెతుక్కుంటూ మూడేళ్ల క్రితం వినుత స్నేహితుడు శివరాజ్ బెంగళూరు వచ్చాడు. ఈ క్రమంలో వినుతను ప్రేమిస్తున్నట్టు శివరాజ్ చెప్పగా అందుకామె తిరస్కరించింది. దీంతో తన ప్రేమను అంగీకరించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని శివరాజ్ బెదిరించాడు. దీంతో ఆమె అంగీకరించింది. అప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది.
కొన్నాళ్లకు ఈ విషయం తెలిసిన భరత్ కుమార్ కోపంతో రగిలిపోయాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో వినుత బైడరహళ్లిలో వేరుగా ఉంటోంది. శివరాజ్ వారంలో రెండుసార్లు అక్కడికి వచ్చి పోతున్న విషయం తెలుసుకున్న భరత్ కుమార్ అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
అనుకున్నదే తడవుగా బుధవారం రాత్రి వినుత ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఆమె చికెన్ తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి దూరి మంచం కింద నక్కాడు. రాత్రి పదిన్నర గంటల సమయంలో శివరాజ్ వచ్చాడు. వినుత, శివరాజ్ ఇద్దరూ భోజనం చేసి నిద్రపోయిన తర్వాత తెల్లవారుజామున మూడు గంటల సమయంలో వినుత వాష్ రూముకు వెళ్లింది. ఆమె అందులోకి వెళ్లగానే ఆ గదికి తాళం వేసిన భరత్.. కత్తితో శివరాజ్‌ను నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.