జలాంతర్గామిలో లోపాలు సరిచేసేందుకు వచ్చి.. విశాఖలో మరణించిన రష్యా ఇంజినీర్
- భారత నావికాదళంలోని జలాంతర్గామిలో లోపాలు
- గత నెలలో విశాఖ వచ్చిన గ్రాచవ్ దిమిత్రి
- విధుల్లో ఉండగానే గుండెపోటుతో కుప్పకూలి మృతి
జలాంతర్గామిలో లోపాలను సరిచేసేందుకు రష్యా నుంచి విశాఖ వచ్చిన ఓ ఇంజినీర్ గుండెపోటుతో మరణించారు. భారత నౌకాదళానికి చెందిన జలాంతర్గామిలో సాంకేతిక లోపం ఏర్పడడంతో దానిని సరిచేసేందుకు రష్యా నుంచి గ్రాచవ్ దిమిత్రి (43) ఫిబ్రవరి 27న విశాఖ వచ్చారు. యారాడలోని డాల్ఫిన్ హిల్స్ ప్రాంతంలోని క్వార్టర్స్‌లో ఆయన ఉంటున్నారు.
నిన్న ఉదయం జలాంతర్గామిలో మరమ్మతులు చేస్తుండగా మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఐఎన్ఎస్ కల్యాణి ఆసుపత్రికి తరలించారు. అక్కడాయన చికిత్స పొందుతూ 2.45 గంటల సమయంలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.