తిరుపతి ఉప ఎన్నికలో ఓటర్ల కుడి చేతికి సిరా చుక్క
- వచ్చే నెల 17న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్
- ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఓటేసిన ప్రజలు
- ఆ గుర్తు ఇంకా చెరిగిపోకపోవడంతోనే ఈ నిర్ణయం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్‌సభ స్థానానికి వచ్చే నెల 17న ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా, ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీలో ఉన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించగా, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ బరిలో ఉన్నారు.
తిరుపతి ఉప ఎన్నికలో ఓటేసే వారికి అధికారులు ఎడమ చేతి చూపుడు వేలికి బదులు కుడిచేతికి సిరా గుర్తు పెట్టనున్నారు. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు వారి ఎడమ చేతికి సిరా గుర్తు పెట్టారు. ఆ గుర్తు ఇంకా చెరిగిపోకపోవడంతో ఉప ఎన్నికలో కుడి చేతికి సిరా గుర్తు పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలింగ్ సిబ్బందికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.