మాస్క్ ధరించని వారికి జరిమానాను పెంచిన చత్తీస్‌గఢ్ ప్రభుత్వం
- ఇప్పటి వరకు రూ. 100 గా ఉన్న జరిమానా
- బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని సూచన
- పలు జిల్లాల్లో 144 సెక్షన్ అమలు
- మరికొన్ని చోట్ల వేడుకలు, సమావేశాల నిర్వహణపై ఆంక్షలు
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. నైట్ కర్ఫ్యూలు, పాక్షిక లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నాయి. వైరస్ మళ్లీ చెలరేగిపోతున్నా మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై కొరడా ఝళిపించేందుకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం రెడీ అయింది. మాస్క్ ధరించకుండా పట్టుబడితే ఇప్పటి వరకు వసూలు చేస్తున్న వంద రూపాయల జరిమానాను ఇప్పుడు రూ. 500కు పెంచింది. ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకారం జరిమానాను పెంచినట్టు ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది.
బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించింది. అలాగే, చత్తీస్‌గఢ్, రాయ్‌పూర్, దర్గ్, బస్తర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో పండుగలు, వేడుకలు, సమావేశాల నిర్వహణపై ఆంక్షలు విధించింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్టు ప్రకటించింది.