వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిన ఇంగ్లండ్

  • పూణేలో ఇంగ్లండ్ ఛేజింగ్
  • స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు డౌన్
  • 40 ఓవర్లలో 317/4
  • ఇంకా 20 పరుగుల దూరంలో ఇంగ్లండ్
క్రికెట్ ఆటను అనిశ్చితికి మరోపేరుగా పేర్కొంటారు. మ్యాచ్ లో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. టీమిండియాతో రెండో వన్డేలో ఇంగ్లండ్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. టీమిండియా విసిరిన 337 పరుగుల లక్ష్యఛేదనలో ఆ జట్టు అద్భుతంగా ఆడింది. ఓ దశలో వికెట్ నష్టానికి 285 పరుగులతో గెలుపు ముంగిట నిలిచినట్టే కనిపించింది. అయితే బెన్ స్టోక్స్ (99) ను సెంచరీ ముంగిట భువనేశ్వర్ కుమార్ అవుట్ చేయడంతో కథ మారింది.

ఆ తర్వాత సెంచరీ హీరో బెయిర్ స్టో (124)ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ మరో వికెట్ చేజార్చుకుంది. అదే ఓవర్లో జోస్ బట్టర్ ను కూడా ప్రసిద్ధ్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం ఆ జట్టు 40 ఓవర్లలో 4 వికెట్లకు 317 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్ స్టన్ ఉన్నారు. ఆ జట్టు గెలవాలంటే 60 బంతుల్లో 20 పరుగులు చేయాలి. చేతిలో ఆరు వికెట్లున్నాయి.


More Telugu News