ఢాకాలో సాంస్కృతిక ప్రదర్శన చూస్తూ బల్లపై దరువేసిన మోదీ... వీడియో ఇదిగో!

  • బంగ్లాదేశ్ లో స్వాతంత్ర్య స్వర్ణోత్సవ వేడుకలు
  • గౌరవ అతిథిగా ప్రధాని మోదీ
  • ఢాకాలో ఘనస్వాగతం
  • సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైన మోదీ
బంగ్లాదేశ్ 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనడం తెలిసిందే. తమ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల్లో గౌరవ అతిథిగా పాల్గొనాలంటూ మోదీని బంగ్లాదేశ్ అధినాయకత్వం ఆహ్వానించగా, ఆయన ఈ ఉదయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను మోదీ ఆసక్తిగా తిలకించారు. బంగ్లా కళాకారుల గీతాలాపనను ఆస్వాదించిన ఆయన బల్లపై దరువేస్తూ తన స్పందన వ్యక్తపరిచారు.

కాగా, ప్రధాని మోదీ రెండ్రోజుల పాటు బంగ్లాదేశ్ లో పర్యటిస్తారు. ఈ ఉదయం ఢాకాలో జాతీయ అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించిన ఆయన నివాళులు అర్పించారు. నాడు బంగ్లాదేశ్ విమోచనలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగనిరతిని ప్రస్తుతిస్తూ అక్కడి సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని పొందుపరిచారు. నేడు పలు కార్యక్రమాలతో బిజీగా గడపనున్న మోదీ రేపు బంగ్లాదేశ్ ప్రధానితో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు.


More Telugu News