భారీ లాభాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • రెండు రోజుల నష్టాల తర్వాత నేడు లాభాలు  
  • 568.38 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
  • లాభాలలో సెయిల్, టాటా స్టీల్ షేర్లు 
కరోనా కేసుల ఉద్ధృతి నేపథ్యంలో వరుసగా రెండు రోజుల పాటు నష్టాలలో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు మళ్లీ లాభాలను చవిచూశాయి. మదుపరులు ఉత్సాహంతో కొనుగోళ్లకు దిగడంతో పలు రంగాల షేర్లు లాభాలలో ట్రేడ్ అయ్యాయి.

అసలు మార్కెట్ల ప్రారంభం నుంచే ఈ రోజు సెన్సెక్స్ సూచీలు లాభాలలో కొనసాగాయి. ఒకానొక సమయంలో 700 పాయింట్ల వరకు లాభపడిన సెన్సెక్స్ చివరికి 568.38 పాయింట్ల లాభంతో 49,008.50 వద్ద క్లోజ్ అవగా.. 182.40 పాయింట్ల లాభంతో నిఫ్టీ 14,507.30 వద్ద ముగిసింది.

ఇక సెయిల్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సెర్ప్, ఏషియన్ పెయింట్స్, టాటా పవర్, ముతూట్ ఫైనాన్స్, పేజ్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర షేర్లు లాభాలను పొందగా... లుపిన్, బాటా ఇండియా, ఫైజర్, ఐషర్ మోటార్స్ తదితర షేర్లు నష్టాలను చవిగొన్నాయి.


More Telugu News