నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై వైఎస్ షర్మిల పరోక్ష వ్యాఖ్యలు

  • తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి షర్మిల సన్నాహాలు
  • ఏప్రిల్ 9న ఆవిర్భావ సభ!
  • తాజాగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా నేతలతో భేటీ
  • పసుపుబోర్డు నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యలు
  • ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం తెలియదా? అంటూ విసుర్లు
ఏప్రిల్ 9న తన రాజకీయ పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిల తాజాగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నేతలు, వైఎస్సార్ అభిమానులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె నిజామాబాద్ ఎంపీ, బీజేపీ యువనేత ధర్మపురి అరవింద్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. అరవింద్ గతంలో ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ... "పసుపు బోర్డును ఇక్కడ ఏర్పాటు చేస్తానంటూ ఎవరో బాండ్ పేపర్ ఇచ్చారట... మాట నిలబెట్టుకోకుండా రైతులను మోసం చేశారట" అంటూ ధ్వజమెత్తారు.

పసుపు బోర్డు కాకుండా, ఎక్స్ టెన్షన్ కేంద్రం ఏర్పాటు చేస్తే రైతుల కష్టాలు తీరతాయా? అని షర్మిల ప్రశ్నించారు. భైంసాలో అల్లర్లు సృష్టించడంపై ఉన్న శ్రద్ధ రైతుల కష్టాలపై లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి పసుపు రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావని అన్నారు.


More Telugu News