షుగర్, బీపీతో బాధపడుతున్నాను.. నాకు ఓట్లు వేయండి బాబూ!: సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగిస్తున్న తమిళనాడు మంత్రి
- మంత్రి విజయభాస్కర్ వ్యాఖ్యలు వైరల్
- సమర్థించుకున్న మంత్రి
- తానేమీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించడం లేదని వ్యాఖ్య
- ఉన్న విషయాలే చెబుతున్నానన్న మంత్రి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓ మంత్రి విచిత్ర వ్యాఖ్యలు చేస్తూ తనకు ఓట్లు వేయాలని కోరారు.తాను బీపీ, షుగర్‌తో బాధపడుతున్నానని, కాబట్టి తనను ఆదరించాలని చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారు. మంత్రి విజయభాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఆయన పుదుకోట్టై జిల్లా విరాళిమలై నుంచి రెండు సార్లు గెలిచారు. ఆరోగ్య శాఖ మంత్రిగా చాలా కాలంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తాను చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తుండడంతో ఆయన స్పందించారు. తాను సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి ఓట్ల కోసం పాకులాడడం లేదని చెప్పుకొచ్చారు.
తన జీవితంలో ఎదుర్కొంటోన్న సమస్యలను గుర్తు చేయడంలో తప్పులేదని అన్నారు. అసలు తాను నియోజకవర్గంలో ఓట్లు అడగాల్సిన అవసరం కూడా లేదని, తనకు ఓట్లు వేయడానికి అత్యధిక శాతం మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
తాను ఇటీవల ఓ ప్రాంతంలో చేసిన ప్రసంగాన్ని కొందరు వక్రీకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను విశ్రాంతి లేకుండా సేవల్ని అందించానని చెప్పారు. ఈ విషయాలను వివరిస్తూ చెబుతూ తనకున్న బీపీ, షుగర్ గురించి మాట్లాడానని అన్నారు. అందులో తప్పేమీ లేదని సమర్థించుకున్నారు.