ఉత్తర కొరియాలో పోర్న్ వీడియో చూస్తూ పట్టుబడిన బాలుడు... స్వల్ప శిక్షతో సరిపెట్టిన కిమ్!
- పోర్న్ వీడియో చూస్తే దొరికితే అక్కడ మరణశిక్షే
- బాలుడికి సామాజిక బహిష్కరణ శిక్ష
- బాలుడు లక్కీ అంటున్న ప్రజలు
ఉత్తర కొరియాలో చట్టాల అమలు ఎంత కఠినంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. కిమ్ జాంగ్ ఉన్ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారని, వారిపై దాష్టీకాలు జరుగుతున్నాయని, తన ఆలోచనలకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారిపై ఏ మాత్రమూ కనికరం చూపకుండా అత్యంత కఠిన శిక్షలు విధిస్తారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా, పోర్న్ వీడియోలు చూసినా, నిబంధనలను ఏ మాత్రం అతిక్రమించినా, వారికి మరణ దండన తప్పనిసరి.
ఈ నేపథ్యంలో పోర్న్ వీడియోలు చూస్తున్న ఓ బాలుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడగా, అతనికి కిమ్ స్వల్ప శిక్షతో సరిపెట్టాడు. దీంతో ఆ బాలుడు అదృష్టవంతుడేనని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఉత్తర కొరియా న్యూస్ ఏజెన్సీ 'డైలీ ఎన్కే' కథనం ప్రకారం, స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి, పోర్న్ వీడియోలు చూస్తే, ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలిపేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అటువంటి వీడియోలు చూసినా, అవి దొరికినా, వాటిని అమ్మినా మరణశిక్షేనని హెచ్చరిస్తున్నారు కూడా.
ఈ సమయంలో ఇంట్లో పెద్దలు ఎవరూ లేని సమయంలో ఓ బాలుడు అడల్డ్ వీడియోలు చూస్తున్నట్టు పోలీసులు ఐపీ అడ్రస్ ట్రాకింగ్ ద్వారా గుర్తించి, అతన్ని పట్టుకున్నారు. దీనికి శిక్షగా బాలుడితో పాటు అతని కుటుంబీకులకు, బాలుడు చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ కు సామాజిక బహిష్కరణ శిక్షను విధించారు. వారిని సరిహద్దు ప్రాంతంలో ఉన్న లేబర్ క్యాంప్ కు తరలించాలని కిమ్ నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.
ఇక ఉత్తర కొరియాలో పోర్న్ చూస్తూ పట్టుబడిన వారికి విధించిన శిక్షల్లో ఇదే చాలా చిన్న శిక్షని అక్కడి ప్రజలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. కొరియా చట్టాల ప్రకారం విద్యార్థి తప్పు చేస్తే, పాఠశాల ప్రిన్సిపాల్ కు కూడా శిక్ష తప్పదు. బాధ్యతా రాహిత్యాన్ని ఏ మాత్రమూ సహించని కిమ్, స్వల్ప శిక్షతో సరిపెట్టారంటే, అతను మారుతున్నాడన్న సంకేతాలు కనిపిస్తున్నాయని కొందరు వ్యాఖ్యానించడం గమనార్హం.