దేశంలో భారీగా పెరిగిపోతోన్న క‌రోనా కేసులు

  • 24 గంటల్లో 59,118 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,18,46,652
  • మృతుల సంఖ్య 1,60,949
  • 5,55,04,440 మందికి వ్యాక్సిన్లు  
దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. మొన్న 53,476 మందికి కరోనా నిర్ధారణ కాగా, గ‌త 24 గంటల్లో 59,118 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 32,987 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,18,46,652కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 257 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,949కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,12,64,637 మంది కోలుకున్నారు. 4,21,066 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 5,55,04,440 మందికి వ్యాక్సిన్లు వేశారు.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,86,04,638 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,00,756 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.


More Telugu News