దేశంలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
- లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించిన మంత్రి
- చెన్నై-ఫూణె మార్గంలో నిర్మాణం
- జంషెడ్‌పూర్‌లోనూ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్
సమీప భవిష్యత్తులో దేశంలో డబుల్ డెక్కర్ రోడ్లు కూడా రాబోతున్నాయి. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ నిన్న లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. చెన్నై-పూణె మార్గంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్టు తెలిపారు. కింది ఎనిమిది లేన్ల రోడ్డు, దానిపై ఓ ఫ్లైవర్, దానిపైన మరో ఫ్లై ఓవర్, దానిపై ‘మాస్ ర్యాపిడ్ ట్రాంజిట్’ ఉంటుందని మంత్రి తెలిపారు.
ప్రశ్నోత్తరాల సమయంలో జంషెడ్‌పూర్ ఎంపీ బిద్యుత్ బరన్ మహతో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ ఈ విషయాన్ని తెలిపారు. జంషెడ్‌పూర్‌లో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం చక్కగా డిజైన్ చేయాలంటూ ఓ మంచి డిజైనర్‌కు బాధ్యత అప్పగించినట్టు మంత్రి వివరించారు. అలాగే, చెన్నై పోర్టును కలుపుతూ తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు రూ. 5 వేల కోట్ల ఖర్చుతో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు నిర్మిస్తామన్నారు.