తిరుమల గిరులపై కొనసాగుతున్న రద్దీ!
- స్వామిని దర్శించుకున్న 51,560 మంది
- హుండీ ద్వారా రూ. 3,.68 కోట్ల ఆదాయం
- నేడు మూడవ రోజు స్వామివారి తెప్పోత్సవాలు
శ్రీ వెంకటేశ్వరుడు కొలువున్న ఏడు కొండలపై భక్డుల రద్దీ కొనసాగుతోంది. నిన్న గురువారం నాడు స్వామిని 51,560 మంది దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.3.68 కోట్ల ఆదాయం లభించింది. 26,255 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు వెల్లడించారు.
కాగా, నేడు తిరుమలలో మూడవ రోజు స్వామివారి తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామి తెప్పలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు పుష్కరిణిలోకి దిగేందుకు అనుమతి లేదని ఇప్పటికే టీటీడీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.