రత్నప్రభకే టికెట్.. అధికారికంగా ప్రకటించిన బీజేపీ
- రత్నప్రభ 1981 క్యాడర్ ఐఏఎస్ అధికారి
- రిటైరయ్యాక బీజేపీలో చేరిక
- ఏప్రిల్ 17న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక
సస్పెన్స్ వీడిపోయింది. తిరుపతి లోక్‌సభ టికెట్ రత్నప్రభకే దక్కింది. ఉప ఎన్నిక బరిలో దిగేది ఆమేనంటూ బీజేపీ గత రాత్రి పొద్దుపోయాక అధికారికంగా ప్రకటించింది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కరోనాతో కన్నుమూశారు. దీంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ 1981 క్యాడర్ కర్ణాటక ఐఏఎస్ అధికారి. రిటైరయ్యే నాటికి ఆమె కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. డిప్యుటేషన్‌పై ఏపీలోనూ ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తించారు. పదవీ విరమణ తర్వాత ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఏప్రిల్ 17న జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.