మహారాష్ట్రలో అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న కరోనా కేసులు!

  • రోజువారీ కొత్త కేసులు సరికొత్త రికార్డులు
  • గురువారం ఒక్కరోజే దాదాపు 36 వేల కొత్త కేసులు
  • 24 గంటల్లో 111 మంది మృత్యువాత
  • అత్యధిక కొవిడ్ యాక్టివ్‌ కేసులు మహారాష్ట్రలోనే
మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. రోజువారీ కొత్త కేసులు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. గురువారం ఒక్కరోజే దాదాపు 36 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా వెలుగు చూసిన తర్వాత గతంలో ఎన్నడూలేని స్థాయిలో 24 గంటల వ్యవధిలో 35,952 కొత్త కేసులు, 111 మరణాలు రికార్డయ్యాయి. అదే సమయంలో 20,444 మంది కోలుకున్నారు.  ముంబయి మహానగరంలోనే 5,504 కొత్త కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది.
 
కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 1,88,78,754 నమూనాల్ని‌ పరీక్షించగా.. 26,00,833 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 22,83,037మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 53,795 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 2,62,685 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
 
దేశవ్యాప్తంగా అత్యధిక కొవిడ్ యాక్టివ్‌ కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ముంబయిలో 32,529 యాక్టివ్‌ కేసులు ఉండగా.. థానే 25,130, పూణె 50,240, నాసిక్‌ 18,176, నాగ్‌పూర్‌ 35,795, నాందేడ్‌ 12,272, ఔరంగాబాద్‌ 17,411, జల్‌గావ్‌ 6,146, అకోలా 4,699, అహ్మద్‌నగర్‌లో 5,946 చొప్పున ఉన్నాయి.


More Telugu News