జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ పై అమెరికాలో సందేహాలు!
- కరోనా నివారణకు సింగిల్ డోస్ వ్యాక్సిన్
- అభివృద్ధి చేసిన జాన్సన్ అండ్ జాన్సన్
- అమెరికాలో అత్యవసర వినియోగానికి అనుమతులు
- జాన్సన్ అండ్ జాన్సన్ డోసులపై పెదవి విరిచిన డెట్రాయిట్ మేయర్
- దీనికంటే ఫైజర్, మోడెర్నా టీకాలు మేలని వ్యాఖ్య
ఇతర కరోనా వ్యాక్సిన్లకు భిన్నంగా జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ సింగిల్ డోస్ టీకా తీసుకురావడం తెలిసిందే. ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిషీల్డ్, కొవాగ్జిన్, మోడెర్నా, ఫైజర్ కరోనా వ్యాక్సిన్లన్నీ డబుల్ డోస్ వ్యాక్సిన్లే. అయితే, అమెరికా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ టీకాపై స్వదేశంలోనే సందేహాలు తలెత్తుతున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ కు అమెరికాలో ఇటీవల అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చారు.
అయితే, 6,200 వ్యాక్సిన్ డోసులను డెట్రాయిట్ పంపగా... నగర మేయర్ మైక్ డుగ్గాన్ వాటిని తిరస్కరించారు. ఫైజర్ బయో ఎన్ టెక్, మోడెర్నా వ్యాక్సిన్లు భేషుగ్గా పనిచేస్తున్నాయని, వాటితో పోల్చితే జాన్సన్ అండ్ జాన్సన్ టీకా పనితీరు ఏమంత ప్రభావంతంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ల సమర్థతను ప్రస్తావించారు.
ఫైజర్-బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ రెండో డోసు ఇచ్చిన 7 రోజుల తర్వాత 95 శాతం ప్రభావంతంగా పనిచేస్తోందని, మోడెర్నా టీకా రెండో డోసు ఇచ్చిన 14 రోజుల తర్వాత 94 శాతం సమర్థంగా పనిచేస్తోందని వివరించారు. కానీ జాన్సన్ అండ్ జాన్సన్ టీకా సింగిల్ డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత 66 శాతం మాత్రమే సమర్థత చూపుతోందని తెలిపారు. దీనికంటే స్పుత్నిక్ వి (92), నోవా వ్యాక్స్ (89) మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు.